రైలు ఢీ కొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి
నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని అర్సపల్లి సమీపంలో రైల్వే పట్టాల దాటుచుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీ కొని వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మృతుని వయస్సు సుమారు 55 సంవత్సరాల ఉంటుందని తెలిపారు.మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీసుల నంబర్ 8712658591 సమాచారం అందించాలని సూచించారు.
