Monday, June 16, 2025
HomePOLITICAL NEWSArmoorకమ్మర్పల్లిలో పేకాట స్థావరం పై దాడి- 2,38,200 రూపాయలు 35 మంది పేకాటరాయిలను అదుపులోకి తీసుకున్న...

కమ్మర్పల్లిలో పేకాట స్థావరం పై దాడి- 2,38,200 రూపాయలు 35 మంది పేకాటరాయిలను అదుపులోకి తీసుకున్న ఎస్సై

నాలుగు కార్లు , ఒక బైకు సీజ్

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై ఇటీవల ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న అనిల్ రెడ్డి మెరుపుదాడి చేశారు.

గత కొంతకాలంగా రహస్యంగా నడుపుతున్న ఈ పేకాట స్థావరం కార్పొరేట్ క్లబ్ కు మించిన స్థాయిలో కొనసాగుతుందని పలువురు పేర్కొన్నారు.

సోమవారం రాత్రి ఎస్సై అనిల్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి 35 మంది పేకాటరాయులను అదుపులోకి తీసుకోవడంతో పాటు రెండు లక్షల 38వేల రెండు వందల రూపాయలు , 35 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

వీటితోపాటు నాలుగు కార్లు ఒక బైకును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వెంకటరాయుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!