మహిళతో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు.
హమాల్వడి కి చెందిన సంఘి రమేష్ వర్మ ఈ నెల 20న అతని తమ్ముడి భార్యతో గొడవ చేసి రోడ్డు మీద న్యూసెన్స్ చేసినందుకు సంఘి రమేష్ వర్మ పై మూడవ ఠాణా లో కేసు నమోదు చేసి సోమవారం జిల్లా కోర్టులో హాజరపరిచారు.
జిల్లా మెజిస్ట్రేట్ అతనికి రెండు రోజుల జైలు విధించినట్లు ఎస్ఐ తెలిపారు.
ఎవరైనా మహిళల పట్ల న్యూసెన్స్ చేసినట్లయితే వారి పైన చట్టరీత్యా తగిన చర్యలు తప్పవని ఎస్ఐ మహేష్ హెచ్చరించినారు.
