HomeTelanganaNizamabadనిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మెన్ గా నియామకం అయిన కేశ వేణు

నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మెన్ గా నియామకం అయిన కేశ వేణు

సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. దిగ్గజ నేతలు కదిలి వస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఈ కార్యక్రమానికి వస్తున్నారు.

పాత మున్సిపల్ కార్యాలయంలో ఉన్న నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకార్యాలయంలోనే వేణు చైర్మన్ గా కొలువు దీరనున్నారు.దాదాపు ముప్పై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నేత గా కొనసాగుతున్న వేణు యూత్ కాంగ్రెస్ తో ఆ పార్టీలో చేరారు.

ఆ తర్వాత 2005 మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటర్ గా గెలిచారు. అయితే మొదట డిప్యూటీ మేయర్ పీసీసీ ఖరారు చేసింది కానీ చివరి నిమిషంలో ఆయనకు డిప్యూటీ మేయర్ పదవీ చేజారింది.

అయినప్పటికి ఆయన పార్టీ విధేయుడిగా పనిచేస్తూ వచ్చారు సుదీర్ఘ కాలం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఖ్యాతి కూడా వేణు కె దక్కింది. డిఎస్ లాంటి దిగ్గజ నేత కాంగ్రెస్ ను వీడి తెరాస లో చేరే క్రమంలో కేశ వేణు ఫై సైతం పార్టీ వదిలేయాలని తీవ్రమైన ఒత్తిడి ఉండే కానీ ఆ తర్వాత బిఆర్ యస్ నుంచి సైతం ఇదే ఒత్తిడి ఎదురుకున్నారు.

ఓ దశలో అర్వింద్ బీజేపీ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కేశ వేణు బీజేపీ లోకి వెళ్తారనే టాక్ ముమ్మరంగా ఉండే. కానీ రాజకీయంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పార్టీలో ప్రస్థానం సాగిస్తూ వచ్చారు.

ఏళ్ల తరబడిగా పార్టీలో వుంటూ వచ్చిన అనేక మంది ద్వితీయశ్రేణి లీడర్లు వరసగా బిఆర్ యస్ బీజేపీ పార్టీలోకి వెళ్లిపోవడంతో అర్బన్ లో పార్టీ చతికిల పడిపోయింది. దానికి తోడు రెండు పర్యాయాలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కె పరిమితం అయింది.

ఓ దశలో పార్టీ నగరంలో ఉనికే నామ మాత్రంగా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికలో ఏకంగా నాలుగో స్థానంలోకి పడిపోయింది. కానీ క్రమంగా పార్టీ బలోపేతం చేస్తూ వచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేలా అర్బన్ నాయకత్వం శ్రమించింది గెలుపు దక్కక పోయినా సరే బిఆర్ యస్ ను మూడో స్థానం లోకి నెట్టేసి రెండో స్థానం లో నిలబడింది లోకసభ ఎన్నికల్లో ఏకంగా మొదటి స్థానంలో కి వచ్చేసింది.

అర్బన్ లో ఆ పార్టీ ఎవ్వరి అంచనాలకు అందనంత తొందరలోనే పుంజుకుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ స్థానమే లక్ష్యంగా పావులు కదులుతుంది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘకాలం అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వేణు కు కీలకమైన నూడా బాధ్యతలు ఇవ్వడం నగర కాంగ్రెస్ కు కొత్త ఊపిరి నింపింది. క్యాడర్ లోనూ మంచి జోష్ వచ్చేసింది.

ఆయా పార్టీలోకి వెళ్లిన ద్వితీయశ్రేణి నేతలు మళ్ళీ సొంత గూటికి వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిక లను ప్రోత్సహించడంతో వేణు మాజీలను అనేక మంది ని పార్టీలోకి తెచ్చారు. చేరికల వ్యూహం తో లోకసభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించారు.

డీఎస్ ,సుదర్శన్ రెడ్డి షబ్బీర్ లాంటి నేతల ప్రోత్సహం తో రాజకీయంగా నిలదొక్కుకున్న వేణు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో గట్టిగా ప్రయత్నించారు. కానీ సమీకరణలు ప్రతిబంధకం అయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నూడా బాధ్యతలు కేశ వేణు కు ఇవ్వడం లో వ్యూహాత్మకంగానే వ్యవహరించింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments