తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 91 వ జయంతి పురస్కరించుకొని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మరియు ఆసుపత్రి సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొందిన మహానుభావుడు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన కోసం తొలుతడుగులేసి, తన జీవిత చరమాంకము వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ మలిదశలో ఉద్యమంలో ఎంతోమందికి మార్గదర్శకులుగా నిలిచిన ఆదర్శమూర్తనీ తెలిపారు.
ఆయన చేసిన కృషికి నేడు మనం స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నామని, తెలంగాణ యావత్తు ఎల్లప్పుడూ ఆ మహానుభావుని స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. వి వి రావు, డిప్యూటీ సూపరింటెండెంట్, డా.బాలరాజ్, డా.కమ్రన్, వైద్య విభాగాధిపతులు, పద్మ,సాయిలు ఆఫీసు సూపరింటెండెంట్, చంద్రకళ నర్సింగ్ గ్రేడ్ I,ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
