సొంత అన్నను తమ్ముడు హత్య చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మోటాట్ పల్లి గ్రామంలో శనివారం వేకువజామున భయభ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే..
గ్రామానికి చెందిన ఎర్ర రాజు(32) గత కొంతకాలం క్రితం తన చిన్నమ్మను తీసుకొని హైదరాబాద్ కు వెళ్లాడు. అప్పట్నుంచి వావివరసలు లేకుండా చిన్నమ్మతో ఎలా సహజీవనం చేస్తున్నావని రాజుతో తన తమ్ముడు శివకుమార్ తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. ఇందులో భాగంగానే ఇంటికి వచ్చిన రాజుతో శివకుమార్ శుక్రవారం అర్ధరాత్రి గొడవపడ్డాడు.
ఈ తరుణంలో నిద్రపోతున్న రాజును ఇంట్లో ఉన్న గొడ్డలితో నరికి, ఆ తర్వాత బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చాడు
