ఇంటిముందు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారి పాము కాటేసిన ఉదంతం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మేడిపల్లి తండాలో జరిగింది . ఆడుకుంటూ గడపాల్సిన ఏడేళ్ల చిన్నారి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
స్థానికుల కథనం మేరకు.. మేడిపల్లి తండా మాజీ ఉప సర్పంచ్ కుమార్తె (7) శుక్రవారం తన ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ క్రమంలో పాపను గమనించని నాగుపాము కాటు వేసింది.
గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనతో వెంటనే స్పందించి, మెరుగైన చికిత్స నిమిత్తం చిన్నారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
