HomeTelanganaNizamabadదీక్షా దివస్ వేదిక గా కవిత గ్రాండ్ ఎంట్రీ ……..భారీజనసమీకరణ కు బిఆర్ యస్ ప్లాన్...

దీక్షా దివస్ వేదిక గా కవిత గ్రాండ్ ఎంట్రీ ……..భారీజనసమీకరణ కు బిఆర్ యస్ ప్లాన్ ……రంగంలోకి జాగృతి బృందం …..మరోసారి చేరువయ్యే ప్లాన్ లో మాజీలు……

దాదాపు ఏడాది తర్వాత నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత మెట్టినింట మరోసారి అడుగుపెట్టబోతుంది. ఢిల్లీ లిక్కర్ కేసు రూపంలో ఎదురైనా విపత్తులను అధిగమించి మరో సారి రాజకీయాల్లో క్రియాశీలం కాబోతున్నారు.

ఇందుకోసం ఆమె గ్రాండ్ ఎంట్రీకి ఈనెల 29 న తలపెట్టిన దీక్షా దివాస్ నే వేదిక కాబోతుంది. ఆమె పాల్గొనే ఈ దీక్ష కు భారీఎత్తున ప్రజలు తరలించే కార్యం లో జాగృతి ఉంది.

ఈమేరకు ఓ బృందం ఈపాటికే నిజామాబాద్ నగరంలో మకాం వేసి ఉంది. గతంలో స్థానిక ఎమ్మెల్యే ల కారణంగా దూరం అయిన నేతలు మరోసారి కవిత కు చేరువయ్యే ఆలోచనలో ఉన్నారు.

ప్రభుత్వం ఏడాది పాలనా ఉత్సవాలను భారీఎత్తున జరపడానికి సిద్ధం అవుతున్న తరుణంలో అధికారం కోల్పొయి రాజకీయంగాగడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్న బిఆర్ యస్ దీక్షా దివాస్ ను భారీఎత్తున నిర్వహించడానికి ప్రణాళిక వేసింది. ఇందులో బాగంగా అన్నీ జిల్లాలకు సీనియర్ నేతలను ఇంచార్జి లుగా రంగంలోకి దించింది.

ఈ మేరకు ఈపాటికే ఆయా జిల్లాలకు వెళ్ళి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఇంచార్జి ఫారూఖ్ మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే లు ఓకే వేదిక మీదికి రావడంతో క్యాడర్ లో నూ జోష్ వచ్చింది. 29 న తలపెట్టిన దీక్షా దివాస్ కు భారీఎత్తున ప్రజలను సమీకరించాలని ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే లే బాధ్యతలు తీసుకోవాలని ఫారూఖ్ స్పష్టం చేసారు.

ఒక్కో సెగ్మెంట్ నుంచి కనీసం వెయ్యి మంది వచ్చేలా కార్యాచరణ వుండాలని ఆయన మాజీ ఎమ్మెల్యే లకు దిశానిర్దేశం చేసారు. అధికారం కోల్పోయాక బిఆర్ యస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దీక్షా దివాస్ సక్సెస్ టెన్షన్ మాజీ ల్లో మొదలయ్యింది.

క్షేత్ర స్థాయిలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కనీసం క్యాడర్ ను సమీకరించడమే దుస్సాధ్యంగా భావిస్తున్నారు.కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీ కవిత ఈ దీక్షా లో పాల్గొనబో తున్నారని జాగృతి సభ్యులు హడావుడి చేస్తుండడం తో మాజీ ఎమ్మెల్యే లు అలర్ట్ అయ్యారు.

ఈసారి పార్టీ వ్యవహారాల్లో కవిత మరింత అగ్రసివ్ గా వుంటారని ప్రచారం క్యాడర్ లో మరింత ఉత్తేజం కలిగిస్తుంది. బిఆర్ యస్ పార్టీలో రాబోయే రోజుల్లో ఆసక్తి పరిణామాలే చోటుచేసుకోబుతున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments