HomeLaw and Orderఫలించిన న్యాయవాదుల నిరసన…

ఫలించిన న్యాయవాదుల నిరసన…

దాడి కేసులో నిందితులఫై ఎట్టకేలకు హత్యాయత్నం కేసు …..మెమో ధాఖలు చేసిన పోలీసులు

న్యాయవాదుల నిరసన విరమింపజేసిన జిల్లా అడిషనల్ జడ్జి కనకదుర్గ….@@@@

అడ్వకేట్ కాశీం పై జరిగిన దాడి ని నిరసిస్తూ న్యాయవాదులు గత రెండు రోజులుగా చేస్తున్న ఆందోళనకు పోలీసులు దిగి వచ్చారు. దాడి ఘటనలో నిందితుల మీద హత్య యత్నం కేసు నమోదు చేశారు ఈ మేరకు మెమో దాఖలు చేశారు. మరో వైపు న్యాయవాదులు ఆందోళన విరమించేలా అడిషనల్ జడ్జి కనుక దుర్గా చొరవతీసుకున్నారు. ఖాసిం మీద దాడి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పునః పరిశీలించి సెక్షన్ అల్ట్రేషన్ మేమో కోర్టులో ఫైల్ చేస్తూ (307crpc)109BNS దాడి చేసిన వారిమీద నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ట్ జడ్జ్ కనకదుర్గ ఆందోళన చేస్తున్న బార్ ప్రెసిడెంట్ మల్లెపూల జగన్మోహన్ గౌడ్,తో పాటు న్యాయవాదులను పిలిచి ధర్నా విరమించాలని కోరారు విచారణ సరైన పద్ధతిలో జరిపి తగు న్యాయం జరిగే విధంగా చూడాలని అదనపు డీసీపీ బస్వారెడ్డి ని ఆమె ఆదేశించారు.పరారీ లో నిందితులను తొందరలోనే పట్టుకుంటామని చెప్పారని కాబట్టి కోర్టు వ్యవహారాలు సాగక పోవడం వల్ల సుదూర ప్రాంతాలనుండి వచ్చే కక్షి దారులు ఇబ్బందులు పడుతున్నారని నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించాలని బార్ అండ్ బెంచ్ రిలేషన్ కాపాడాలని,నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు,ఆమె సూచన మేరకు న్యాయవాదులు ధర్నా విరమించారు.డీసీపీ బస్వరెడ్డి మాట్లాడుతూ న్యాయవాది పై దాడి చేసిన నిందుతులకోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బార్ అండ్ బెంచ్ రిలేషన్ పై తమకు అపారమైన గౌరవం ఉన్నదని న్యాయమూర్తి కనక దుర్గ విజ్ఞప్తి మేరకు ప్రస్తుతానికి నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఆపివేస్తున్నం అని త్వరలో నిందితులను పట్టుకోకపోతే తిరిగి నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని,రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments