ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైలు లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ కస్టడీకి ఇవ్వడానికి శుక్రవారం కోర్టు అనుమతించింది. మూడు రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. దీంతో కవితను సీబీఐ హెడ్ క్వాటర్స్‌కు తరలించనున్నారు.
ఈ నెల 15 వరకు ఆమెను సిబిఐ అధికారులు విచారించనున్నారు.లిక్కర్ కేసులో సిబిఐ గతంలోనే ఆమెను హైదారాబాద్ లోఇంట్లోనే విచారించారు. లిక్కర్ కేసులోనే మనీలాండరింగ్ ఆరోపణల ఫై ఈడీ కవిత ను అరెస్టు చేసింది. వారం రోజులు కస్టడీ లోకి తీసుకోని విచారించి తీహార్ జైలు కు తరలించారు.
అక్కడే సీబీఐ అధికారులు కవితను అరెస్టు చేసారు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌తోపాటు, అరెస్ట్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.
. తనను కస్టడీకి ఇవ్వొద్దని, ఇప్పటికే సిబిఐ తనను ప్రశ్నించిందని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ సీబీఐ అడుగుతోందని కవిత తెలిపారు. సీబీఐది వృథా ప్రయాస అని, చెప్పడానికి ఏమీ లేదని, సీబీఐ తప్పుడు మార్గంలో వెళ్తోందని కవిత ఆవేదనవ్యక్తం చేసింది.