ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది . కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెయిల్ పిటిషన్ ను విచారించారు.
దీంతో కవితకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు.