ఈరోజు ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఈవో దుర్గాప్రసాద్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద బలహీన వర్గాల పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని స్కూలు ప్రారంభమై నెల గడుస్తున్న నేటికీ మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించాల్సిన ఐదు నెలల బకాయి బిల్లులు, వేతనాలు , చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా మూలిగే నక్క పై తాటికాయబడ్డ చందంగా అదనంగా రాగి జావా, కోడిగుడ్డు ,అల్పాహారం అందించాలని కార్మికుల పైన ఒత్తిడి తీసుకురావటం సరైన పద్ధతి కాదన్నారు.
కొన్ని ప్రాంతాల్లో శ్రీ సాయి ట్రస్ట్ ద్వారా పిల్లలకు రాగిజావ బెడ్తూ వండినందుకుగాను ఆ ట్రస్ట్ వారికి ఒక రూపాయి 25 పైసలు చెల్లిస్తున్నారని ఆపరేషన్ ఈ అటువంటి విధానాన్ని కార్మికుల పట్ల అవలంబించాలని గత ప్రభుత్వ హయాం నుండి యూనియన్ ద్వారా పోరాటం చేస్తుంటే నేటికీ ప్రభుత్వం స్పందించకపోగా కార్మికులకు అదనంగా ఆర్థిక భారం మోపే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అన్నారు.
కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్లో 6 రూపాయలు ఉంటే ఐదు రూపాయలకే కోడిగుడ్డు పెట్టమనటం ఎంతవరకు సమంజసం అన్నా రు. అల్పాహారం, రాగిజావ కు సంబంధించి అదనంగా 12 రూపాయలు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలని ఇన్సూరెన్స్ యూనిఫారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి .చక్రపాణి, అధ్యక్షురాలు సాయమ్మ నాయకులు పల్లికొండ నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
వై. ఓమయ్య
ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి