అప్పుల బాధతో యువకుడు బలన్మరనం చెందిన విషాద ఘటన నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
పోలీస్ లు తెలిపిన సమాచారం మేరకు. నగరంలోని మారుతి నగర్ కు చెందిన అనిరుత్ రెడ్డి(28).గత 8సంవత్సరాల క్రితం స్వాతి ని ప్రేమించి వివాహం చేసుకున్నారు.
వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అనీరుత్ రెడ్డి వృత్తి రీత్యా నగరంలో స్విగ్గీ డెలవరి గా విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పులు కుప్పలుగా అవ్వడంతో ఏం చేయని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలిపారు.
జీవితం పై విరక్తి చెంది ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ మహేష్ తెలిపారు.