భారతదేశంలో 60 శాతం మంది వ్యవసాయ కూలీ ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారని, వ్యవసాయ కార్మికులకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం కోరారు.సోమవారం రెంజర్ల మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం బైఠాయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉపాధి హామీలు 600 రూపాయలు రోజువారి కూలీ కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధంగా రోజురోజుకు ధరలు ఆకాశం ఉన్నాయని, తినబోతే తిండి లేక కొనబోతే డబ్బులు లేక వ్యవసాయ కార్మికులు అర్దాకలతో జీవిస్తున్నారని తెలిపారు. 600 రూపాయలు ఇవ్వాలి వ్యవసాయంలో పనిచేస్తున్న 50 సంవత్సరాలు నిండిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని, ఇల్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె నసీర్. డివిజన్ నాయకులు పోశెట్టి రవి వైద్యనాథ్ ఏఐపీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పుట్టి నాగన్న. జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ రెంజల్ చిన్న పోశెట్టి తో పాటు తదితరులు పాల్గొన్నారు.