తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు
14 గేట్లు ఎత్తివేత..
అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచనున్న అధికారులు.
శ్రీరామ్ సాగర్ లోకి పెరగనున్న వరద ప్రవాహం.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా గోదావరి నదిపై ఉన్న బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను సోమవారం ఎత్తి వేశారు. 17 అక్టోబర్ 2013న కేంద్ర మంత్రివర్గం ,సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, కేంద్ర జల వనరుల సంఘం ఒప్పందం మేరకు ప్రాజెక్టు గేట్లను ప్రతి ఏటా జులై 1న తెరుస్తారు. కేంద్ర జల సంఘం అధికారులు, తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో 14 గేట్లు పూర్తిగా ఎత్తారు. బాబ్లిగేట్లు ఎత్తడం వలన శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు రానుంది. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా, సిడబ్ల్యూసి ఈఈ వెంకటేశ్వర్లు, ఈఈ చక్రపాణి, నాందేడ్ ఈఈ బాన్సద్, ఏఈఈ వంశీ, ఎస్డీఈ సతీష్‌లు ఉన్నారు.