వేల్పూర్: ఇది సంగతి:
స్థానిక సమరానికి సమయం ఆసన్నమవుతోంది. ఆరు నెలలగా గ్రామ పంచాయతీలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దీంతోపాటు ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలకు కూడా ఈ నెల 4న పదవి కాలం ముగియనుండడంతో గ్రామాల్లోని స్థానిక సమరానికి ఇప్పటినుంచే రాజకీయం గ్రామాల్లో వేడెక్కింది.
వేల్పూర్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలు అయిన అంక్సాపూర్, పచ్చల నడుకుడ, మోతే తదితర గ్రామాల్లో ఇప్పటినుండే పోటీ చేయవలసిన అభ్యర్థులు తమ యొక్క బలాన్ని నిరూపించుకోవడానికి విందులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కులాల వారిగా ఉన్నటువంటి బలమైన వ్యక్తులను తమ వైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతున్నారు.
గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్లు మరో పది సంవత్సరాలు ఉంటాయని చెప్పడంతో అదే రిజర్వేషన్లు కొనసాగుతాయని భావిస్తున్న నేతలు పోటీకి సిద్దం అవుతున్నారు . రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సమరానికి కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటిస్తారా లేదా గతంలో కొనసాగిన రిజర్వేషన్లని ప్రకటిస్తార అనే విషయం సంశయంగానే మిగిలింది .
అయినప్పటికీ రిజర్వేషన్లు ఏదైనా ప్రతి సామాజిక వర్గం నుంచి కొంతమంది బడా నేతలు పోటీకి సిద్ధమవుతూ ఖర్చులకు వెనుకాడకుండా కుర్చీ కోసం వెంపర్లాడుతు విందులను కొనసాగిస్తున్నారు. అయితే స్థానికంగా బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం కావడంతో వీరి కార్యకర్తలు బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి గత నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయినప్పటికిని తన యొక్క రాజకీయ బలాన్ని రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో మంచి పేరు ఉండి ప్రతి ఒక్కరికి నేనున్నానని భరోసా ఇవ్వడంతో బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం నింపింది.
అదేవిధంగా కొంతమంది స్థానికనేతలు టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో కి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీకి పల్లెల్లో మంచి పట్టు సాధింపు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు పూర్తి అవుతున్న వేళ స్థానిక సమరానికి గ్రామాల్లోని నేతలు యువనేతలు పోటీకి సిద్ధమవుతూ తమ యొక్క బలాబలాలను నిరూపించుకోవడానికి ఇప్పటికే రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికవ్వడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్న అదేవిధంగా గ్రామాల్లోని గ్రామ అభివృద్ధి కమిటీ యొక్క విధివిధానాలను దాటకుండా ఉండడానికి ఈసారి కూడా స్థానిక సమరానికి పోటీ చేయవలసిన అభ్యర్థులకు వేలంపాట ద్వారానే ఎన్నికకు మొగ్గుచూపుతున్నట్టుగా సమాచారం. సర్పంచ్ కుర్చీ కోసం ఆరాటపడుతున్న నేతలు 40 నుంచి 50 లక్షల వరకు వేలంపాట కూడా సిద్ధమవుతున్నారు.
అలాగే గ్రామాల్లో కులాల వారీగా ఉన్నటువంటి నేతలను ఇప్పటినుంచి ప్రసన్నం చేసుకుంటూ స్థానిక ఎన్నికల్లో తనకే మద్దతు ఇవ్వాలని విందులు ఏర్పాటు చేస్తూ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. అయితే గతంలో ఉన్న రిజర్వేషన్లు ఉన్నట్టయితే గతంలో పోటీ చేసిన అభ్యర్థులే వేల్పూర్ మండలంలో దాదాపు 10 గ్రామాలలో పాత అభ్యర్థులే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
గతంలో సర్పంచ్ గా ఎన్నికైన వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న వేళ గత టిఆర్ఎస్ ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులను అందజేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈసారి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవలసిన అభ్యర్థులు అదేవిధంగా కొనసాగుతుందని ఉద్దేశంతో కొంతమంది ఆశావాహులు తమ యొక్క ఆర్థిక బలాన్ని స్థానిక బలాన్ని నిరూపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
సర్పంచిగా పోటీ చేసిన వ్యక్తి గ్రామంలో జవాబుదారితనం ఎక్కువగానే ఉంటుందన్న విషయం గతంలో పోటీ చేసిన అభ్యర్థులు అనుభవించిన విషయాలను కొత్త నేతలకు చెప్పినప్పటికిని తమ ఉత్సాహాన్ని వెనక్కి రాకుండా ఖచ్చితంగా పోటీ చేయాలనే నిర్ణయించుకున్నారు. ఈసారి అంక్సాపూర్ పడగల్ మోతే తదితర గ్రామాలలో 25 సంవత్సరాల్లోపే వయసు ఉన్నవారు పోటీకి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.
గ్రామాల్లోని ఉన్నటువంటి యువజన సంఘాలను తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటినుండే వారిని ప్రసన్నం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున సునీల్ రెడ్డి యొక్క సేవా కార్యక్రమాలు అతను చేసినటువంటి పేదలకు అండదండగా ఉంటూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి సునీల్ రెడ్డి వర్గం ఈసారి స్థానిక ఎన్నికల్లో సమరానికి గట్టిగానే పోటీ ఇస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సమరాల్లో ప్రతి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా ఉండాలని నిర్ణయం గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కొన్ని గ్రామాలలో వేలంపాట నిర్వహించినట్టయితే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు పదవిని దక్కించుకునే ప్రయత్నం చేసినప్పటికీని ఆ ప్రయత్నాన్ని విఫలం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా దానిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు కూడా వారు ఇప్పటి నుంచే చేస్తున్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గ ఎన్నికల్లో కొన్ని కారణాలవల్ల రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కొనసాగించలేకపోవడం రైతుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పటికిని కొన్ని పనులు వ్యతిరేక దిశగా వెళ్లినందున రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి మొగ్గు చూపారు జులై 4న ఎంపీటీసీ జడ్పిటిసిల పదవీకాలం కూడా ముగియడంతో స్థానిక నేతలు మండలాల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి తమ యొక్క నేతను ప్రసన్నం చేసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం ముఖ్యంగా వేల్పూర్ గ్రామంలోని గతంలో సర్పంచ్ పదవికి బిజెపి నేతకు పట్టం కట్టినప్పటికిని ఈసారి స్థానిక సమరంలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించి ఉంది.
ఈసారి రాష్ట్రంలో ఇటు బిజెపి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పోటీగా భావించినప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం గట్టి పోటీని ఇచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం తమ యొక్క వాగ్దానాల నెరవేర్చినట్లు అయితే కచ్చితంగా స్థానిక సమరంలో రాష్ట్రస్థాయిలో బోని కొడుతుందని విశ్వాసంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఆగస్టు 15 వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు వాగ్దానా లో నాలుగు వాగ్దానాలు నెరవేర్చిన ప్రభుత్వం ఈ రుణమాఫీ ప్రకటించినట్లయితే రైతుల విశ్వాసాన్ని నింపి తమ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉంది. అలాగే దాదాపు ధరణి సమస్యలు పరిష్కారానికి ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సమరానికి ముందే భూ సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసింది.
దీనివల్ల ఇటు రుణమాఫీ అతను ధరణి సమస్యల పరిష్కారం చేయడంతో రైతుల్లో ఉత్సాహం వచ్చి కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీకే అప్పచెప్పే కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలోని దాదాపుగా చాలామంది నేతలు బడా నేతలు టిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకింత వెనుకబడి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా అప్పటికిని స్థానిక సమరం ఇప్పటినుంచి ఆసన్నమైంది.
