రెండు రోజుల కృతమే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ను కల్సిన నేపథ్యంలో గురువారం మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చనే ప్రచారం ఉత్తదే నని తేలిపోయింది. మంత్రి వర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో ఢిల్లీ స్థాయిలో ఇంకా ఎడతెగని కసరత్తులు సాగుతున్నాయి.
గురువారం జరిగే విస్తరణలో తమ నేత సుదర్శన్ రెడ్డి వర్గీయులు సంబరపడ్డారు. హోం శాఖ రాబోతుందంటూ ఊదరగొట్టారు. కానీ బుధవారం సాయంత్రం దాక విస్తరణ కు సంబంధించి అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు రాక పోవడంతో వారంతా డీలా పడ్డారు.
ఈసారి మంత్రి వర్గ విస్తరణ లో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖరారు కానుంది. అందుకే ఆయన వర్గీయులు విస్తరణ కోసం నెలల తరబడిగా ఎదురుచూస్తున్నారు. కానీ గురువారం ఖాయమని సుదర్శన్ రెడ్డే స్వయంగా ఒకరిద్దరు సన్నహితులకు వారం రోజుల క్రితం హింట్ ఇవ్వడంతో ఆయన వర్గీయుల్లో సంబరం అంతా ఇంత కాదు.
మొదట ఆషాడ మాసం వచ్చే లోపే మంత్రి వర్గం విస్తరణ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఫై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి చేస్తూ వచ్చారు. ఈ మేరకు ఆయన నలుగురి పేర్లను సిఫారస్ చేసి వచ్చారు. దీనిపై సామాజిక సమీకరణ ఆధారంగా ఢిల్లీ పెద్దలు కసరత్తులు మొదలు పెట్టారు .
విస్తరణ కు ఈ నెల 4 న లోపే ఉండేలా సీఎం సూచించారు ఎందుకంటే ఆషాడ మాసం లో ముహుర్తాలు వుండవు అందుకే వేగంగా పావులు కదిపారు కానీ కొత్త పీసీసీ .
అధ్యక్షుడి నియామకం మంత్రివర్గ విస్తరణ ఒకదానికి ఇంకోటి ముడి పడి ఉడడంతో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. పీసీసీ రేసులో ఉన్న నేతలు మహేష్ గౌడ్ బలరాం నాయక్ మధుయాష్కీ లు గత కొద్దీ రోజులుగా ఢిల్లీ లోనే మకాం వేసి ఉన్నారు.
తాజాగా మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు సైతం ఢిల్లీ క్యూ కట్టారు. ఈ మేరకు సీఎం రేవంత్ సైతం బుధవారం ఢిల్లీ వెళ్లారు.
