బిఆర్ యస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా సమావేశం అవుతున్నారు. గురువారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నే భేటీ అయ్యారు.
హరీశ్ రావు స్వయంగా నేతలను ఫామ్‌హౌస్ తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. వరస వలసలపై పార్టీ లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు పార్టీ వీడకుండా ఎలా కట్టడి చేయాలనేది అధినేత కు అంతు చిక్కడం లేదు.
వలస జరగకుండా అనుసరించాల్సిన వ్యూహం మీద నేతలతో అరా తీశారు మరో వైపు వారం రోజుల పాటు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న రాష్ట్రానికి తిరిగి వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు భేటీ జరిగిన మరుసటి రోజే పార్టీ ముఖ్యనేతలతో గులాబీ బాస్ సమావేశం జరపడం గమనార్హం