HomeCRIMEకన్న తల్లి కి నిప్పంటించిన యువకుడు ……సజీవదహనం అయిన వృద్ధు రాలు

కన్న తల్లి కి నిప్పంటించిన యువకుడు ……సజీవదహనం అయిన వృద్ధు రాలు

మద్యం కు బానిసైన నవమాసాలు మోసి పెంచి పెద్దచేసిన ఓ కొడుకు ఆ తల్లీ పాలిట యముడి గా మారాడు అత్యంత అమానుషంగా సజీవ దహనం చేసాడు ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోశనివారం జరిగింది .. కోటగిరికి చెందిన భూమవ్వ అనే వృద్ధురాలి కుమారుడు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు.

శనివారం కూడా మద్యం మత్తులో ఉన్న అతడు తాగేందుకు డబ్బులివ్వాలని తల్లితో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయాడు. ఉన్మాది గా మారాడు
ఇంట్లో ఉన్న పాత బట్టలను ఆమెపై వేసి నిప్పంటించాడు.

మంటలు అంటుకుని భూమవ్వ కేకలు వేస్తున్నా కనికరించకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. తీవ్రమైన మంటల ధాటికి ఆ వృద్ధురాలు అక్కడికక్కడే సజీవ దహనమై ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న కోటగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.కొడుకును అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments