HomePOLITICAL NEWSబాజిరెడ్డి వైపే మొగ్గు .......బిఆర్ యస్ లో కొలిక్కి వచ్చిన కసరత్తు

బాజిరెడ్డి వైపే మొగ్గు …….బిఆర్ యస్ లో కొలిక్కి వచ్చిన కసరత్తు

వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది బిఆర్ యస్ ఎడతెగని కసరత్తులు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే అభ్యర్థి ని ఖరారు చేయాలనే ఆలోచనలో అధినేత కెసిఆర్ ఉన్నారు.మాజీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వైపే అధిష్టానం మొగ్గుచూపుతోంది. మొదట అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో పోటీకి వెనుకాడిన బాజిరెడ్డి గోవర్ధన్ కేటీఆర్ ఒత్తిడి తో పోటీకి ముందుకు వచ్చారని సమాచారం.

ఎలాగో కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామజిక వర్గం నేతకే టికెట్ ఖరారు చేస్తుండంతో బిఆర్ యస్ బిసి నేత ను రంగంలోకి దించడానికి సిద్ధం అయింది. బీజేపీ అభ్యర్థి అర్వింద్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే అదే సామాజిక వర్గం కు చెందిన నేతనే రంగంలోకి దించాలనే ఆలోచనతో నాలుగు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసి మాస్ లీడర్ ముద్ర ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ వైపు మొగ్గుచూపింది. గోవర్ధన్ గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యేగా పనిచేసారు.

ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ లలో ఆయన కు బలమైన ఫాలోఇంగ్ ఉంది. భారీ బంధు గణం కూడా ఉంది. కోరుట్ల ,మెట్ పల్లి లో ఆయన ప్రాబల్యం ఉంది. అందుకే బాజిరెడ్డి పోటీ కు ఆసక్తి చూపినట్లు సమాచారం. మరో వైపు అర్వింద్ ను ఢీకొట్టే బలమైన నేత కనుచూపు మేరలో కనిపించలేదు.

నిజానికి అర్వింద్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించే వ్యూహరచనలో ఉన్న బిఆర్ యస్ ఎడతెగని కసరత్తులు చేసింది. మున్నూరు కాపు సామజిక వర్గం కు చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ అయితేనే ఎన్నికల్లో దూకుడుగా వెళ్తారని భావించి ఆయన తో సంప్రదింపులు జరిపి రాజకీయ భవిష్యత్ కు కూడా భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కవిత సైతం బాజిరెడ్డి పేరు నే ప్రతిపాదించారని సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments