దూడను చంపిన పులి, భయంతో రైతులు కలవరపాటుకామారెడ్డి జిల్లా, లింగంపేట మండలం బోనాల్ తండా శివారులో వన్యప్రాణి హడావిడి కలకలం రేపింది. బర్మావత్ దరియా . అనే రైతు చేను వద్ద కట్టేసిన దూడపై చిరుతపులి దాడి చేసి హతమార్చింది.
దీంతో రైతుల మధ్య భయాందోళనలు వ్యాప్తి చెందాయి. పశువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పశువైద్యాధికారితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామ నిర్వహించారు. రైతుల డిమాండ్రైతులు అటవీ శాఖను చర్యలు తీసుకోవాలని, చిరుత ఉపద్రవం నివారించేందుకు తక్షణమే సురక్షిత ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
పొలాల వైపుగా వెళ్లేందుకు భయపడుతున్న రైతులు, తమ పశువులను ఎలా రక్షించుకోవాలో తెలియక కంగారు పడుతున్నారు. ప్రాంతంలో అప్రమత్తత అవసరం చిరుత తిరుగుతున్న నేపథ్యంలో రైతులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
