HomeCRIMEరైలు నుంచి జారీ కింద పడి వ్యక్తి దుర్మరణం..

రైలు నుంచి జారీ కింద పడి వ్యక్తి దుర్మరణం..

రైలు నుంచి జారీ కింద పడి వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సిర్నాపల్లి – ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.

మేడ్చల్ కు చెందిన చిట్యాల భూంరెడ్డి(80) రైలు లో ప్రయాణించే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ కింద పడి తలకు బలమైన గాయమై అక్కడిక్కకడే మృతి చెందినట్లు తెలిపారు.

రైల్వే స్టేషన్ మేనేజర్ సమాచారం మేరకు రైల్వే పోలిసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments