గల్ఫ్ కార్మికుల సమస్యల పై దుబాయి నేతలతో భేటీ…అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి మాజీ ఎమ్మెల్యే, ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి యూఏఈ దేశం దుబాయి లోని ప్రముఖ లీగల్ కన్సల్టింగ్ సంస్థ ‘మహ్మద్ సల్మాన్ అండ్ లీగల్ కన్సల్టెంట్స్’ సంస్థను మంగళవారం సందర్శించారు.
అరబ్ అడ్వొకేట్ సాద్ మహ్మద్ అల్ మర్జూఖి, భారతీయ న్యాయవాదులు బిందు ఎస్ చెట్టూర్, అశ్విన్ చతుర్వేది లతో గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయపరమైన అంశాలు వాటి పరిష్కారాల గురించి చర్చించారు.
2010 లో షార్జాలో 17 మంది భారతీయులను ఉరిశిక్ష నుంచి తప్పించడంలో బిందు కీలకంగా వ్యవహరించారు. ఆయనతో నంగి దేవేందర్ రెడ్డి, మంద భీంరెడ్డి, సుతారి సత్యం, పబ్బ భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
