ఉద్యోగుల సంక్షేమానికి తమ యూనియన్ కట్టుబడి వుందని టీఎన్జీవో యూనియన్ సెంట్రల్ అధ్యక్షుడు మరం జగదీశ్వర్ స్పష్టం చేశారు. టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి సెంట్రల్ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగాఆయన మాట్లాడారు టిఎన్‌జిఓస్ ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాము. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాము. అందరి సహకారంతో యూనియన్‌ను మరింత ముందుకు తీసుకువెళ్తాము.”అని అన్నారు.
సెంట్రల్ కార్యదర్శి డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ, “ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాము. సమిష్టిగా కార్యచేసి ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తాము.అని అన్నారు.అంతకు ముందు యూనియన్ సెంట్రల్ నేతలను ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో హైదారాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్ ,కార్యదర్శి అసోసియేట్ అధ్యక్షులు రాజకుమార్ కుర్రాడి శ్రీనివాస్ బాలరాజు లు పాల్గొన్నారు
