HomeDevotionalభక్తజన సంద్రమైన లింబాద్రి గుట్ట ....శ్రీవారి గిరి ప్రదక్షిణ.కు భారీగా వచ్చిన భక్తులు

భక్తజన సంద్రమైన లింబాద్రి గుట్ట ….శ్రీవారి గిరి ప్రదక్షిణ.కు భారీగా వచ్చిన భక్తులు

భీమ్‌గల్ లింబాద్రి గుట్ట కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవముగా సాగుతున్నాయి గిరి ప్రదక్షిణాలకు భారీగా భక్తులు తరలి వచ్చారు .

ఉత్సవాలలో భాగంగా సోమవారం మధ్యాహ్నం భక్తి శ్రద్దలతో శ్రీ వారి ఆయుధమైన చక్రస్వాముల వారి కొండ ప్రదక్షిణ కార్యక్రమాన్ని కన్నుల పండువగా భక్తజన సంద్రమైన గుట్ట పరిసర ప్రాంతాలలో భక్తుల కోలాటంల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఉదయం నిత్యం మాదిరిగానే గర్భాలయంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం తులసీ, విష్ణువుల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం, సాయంత్రం పూట హోమము, బలి ప్రధానము జరిపారు.

గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తి పారవశ్యంతో వేలాదిమంది భక్త జనులు పాల్గొని గోవింద గోవింద నామస్మరణలతో స్వామి వారి ఆయుధమైన చక్రస్వామి వెంట నడిచారు.

ఉత్సవ యోగ సంరక్షణ కొరకు శ్రీ చక్ర స్వాముల వారిచే నింబాచల గిరి ప్రదక్షిణ గావించారు.

*నేడు సీతానగరిపై శ్రీ లక్ష్మీ నరసింహునికి డోలారోహణము*శ్రీ నింబాచల లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలాలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహునికి కొండ పై ఉన్న సీతానగరి పై డోలారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నేడు నిర్వహించనున్నారు.

స్వామి వారి శిఖరానికి చేరువలో సీతానగరి ఉంది. అక్కడే శ్రీ లక్ష్మీ నరసింహులకు లాలి పాటలు పాడుతూ డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం నేడు రాత్రి 8 గంటలకు ఉంటుంది. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి డోలసేవ వీక్షిస్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments