HomeCRIMEచేవెళ్లలో బస్ ప్రమాదం దురదృష్టకరం..

చేవెళ్లలో బస్ ప్రమాదం దురదృష్టకరం..

చేవెళ్ల మండలం మీర్జాపూర్ సమీపంలో చోటుచేసుకున్న బస్ ప్రమాదం దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.“ఇలాంటి ఘోర ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా నడిపే కంకర టిప్పర్ల వలన అమాయక ప్రజల ప్రాణాలు బలికావడం విచారకరం.

ప్రమాదానికి కారణమైన టిప్పర్ యజమానుల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలనీ అన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం కల్పించాలి” అని అన్నారు. అలాగే, రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టి, నియంత్రణ లేని టిప్పర్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా మారాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments