50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు లైన్ క్లియర్ అయింది.
ఈ మేరకు గవర్నర్ గెజెట్ నోటిఫికేషన్ విడుదలచేసారు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, పురపాలికలు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేసి…
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణ బిల్లులు రెండింటిని సెప్టెంబర్ 2న రాజ్ భవన్ కు పంపిన విషయం తెలిసిందే. ఆగస్టు 31న అసెంబ్లీ లో, సెప్టెంబర్ 1న శాసన మండలిలో ఆ రెండు బిల్లులు ఆమోదం పొందాయి.
