నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో, ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలులేదని రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు.
ఎటువంటి నిరసన కార్యక్రమాలు ఉన్న నిజామాబాద్ ఏసీపీ అనుమతితో ధర్నాచౌక్, ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంతంలో చేసుకోవాలని తెలిపారు. ఎవరైనా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు జరిపితే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
