సుమారు 50 కి పైగా వాహనాలభారీ కాన్వాయితో హైదారాబాద్ నుంచి బయలు దేరిన మహేష్ కు భిక్కనూరు నుంచి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది.
బిక్కనూర్ టోల్ ప్లాజా దగ్గర జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు. మహేశ్ తోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు.
అక్కడే ఏర్పాటు చేసిన వేదిక వద్ద మహేష్ ను గజమాల తో సత్కరించారు ఈ సందర్భంగా మహేష్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని అంత కలిసి కట్టుగ పనిచేయాలన్నారు , కనీసం 90 శాతం సర్పంచ్, ఎంపీటీసీ జడ్పీటీసీ, విండో చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా తామంతా కృషి చేయడం జరుగుతుందన్నారు.
