నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది మల్లెపూల జగన్మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు రెండవ రోజు కోర్టు మైన్ గేట్ వద్ద విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత హేయమని న్యాయవాదుల పట్ల ఇట్లా వ్యవహరిస్తే సామాన్య జనుల పరిస్థితి ఏంటో అద్దం పట్టినట్లు కనబడుతుందని అన్నారు.
కొంతమంది పోలీసులు కాకి డ్రెస్ వేసుకోగానే చట్టానికి తమే బాస్ అన్నట్లు వ్యవహారం నడుపుతున్నారని,ఏటువంటి తీరు మారకుంటే రానున్న రోజుల్లో న్యాయవాదుల నుండి తగిన ప్రతిఘటనను,ఉద్యమాలను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు న్యాయవాదుల పై జరుగుతున్న దాడులను పరిగణం లోకి తీసుకొని అడ్వకేట్ ప్రోటాక్షన్ ఆక్ట్ తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పిల్లి శ్రీకాంత్,వసంత రావ్,ఆశన్నారాయణ,సుజిత్,నాగేశ్వర్,అన్వేష్,తదితరులు పాల్గొన్నారు..
