పత్రి పల్లెకూ బస్సులు నడిపిస్తాం.జిల్లా కేంద్రంలో 13 సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం..నష్టాల బాట నుంచి టీఎస్ ఆర్టీసీ క్రమంగా గట్టెక్కుతోంది.
ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న సంస్థ యాజమాన్యం ఇప్పుడు లాభాల దిశగా పయనిస్తోందనీ బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తంచేశారు.
శుక్రవారం నిజామాబాద్ బస్ స్టాండ్ లో నూతనంగా 13 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేటాయించిన 65 బస్సుల్లో 13 విద్యుత్ సూపర్ లగ్జరీ బస్సులను తొలి విడతలో ప్రారంభించారు .
ఈ బస్సులను నిజామాబాద్ నుంచి జేబీఎస్ వరకు నడపనున్నారని తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సులతో పర్యావరణ రక్షణ కోసం ,భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత వాతావరణం అందించడానికి ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చామని, దశలవారీగా డీజిల్ బస్సులు తొలగిస్తామని, పత్రి పల్లెకూ బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు.
ప్రజా పాలన ఏర్పడిన తర్వాత విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని దినదినాభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే మహాలక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుంచి రూ.3500 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం మహిళలు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ,రూరల్ ఎమ్మల్యే భూపతి రెడ్డి,నగర మేయర్ నీతూ కిరణ్, ఆర్టీసీ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
