కాంగ్రెస్ తలపెట్టిన జనహిత పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబర పడుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు రోజుల పాటు సాగిన ఈ యాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ తెప్పించింది. జిల్లాలో ని ముఖ్య నేతలంతా జనహిత వేదిక ఒక్కటై కదలడం పార్టీ వర్గాలకు హాట్ టాపిక్ అయింది.
దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం కరువైన ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ యాత్ర పార్టీ గత వైభవం ను గుర్తుకు తెచ్చింది. అర్గుల్ రాజారామ్ సంతోష్ రెడ్డి లాంటి దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహించిన ఆర్మూర్ లో పార్టీ ఇప్పుడు దైన్య స్థితి ని ఎదుర్కొంటుంది.
బీజేపీ బిఆర్ యస్ లే హోరాహోరీగా తలపడుతున్నాయి. అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపలేక పోయింది.
బిఆర్ యస్ నుంచి వచ్చిన వినయ్ రెడ్డి ఆశించిన మేరకు దూసుకు వెళ్లలేక పోతున్నారు. అందుకే వ్యూహాత్మకంగా ఆర్మూర్ నియోజకవర్గం లోనే జనహిత నిర్వహించారు.
జిల్లా పార్టీలో ముఖ్య నేతల మధ్య సమన్వయం జిల్లాలో పార్టీ ప్రతిష్ట మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.మొన్నటి దాక జిల్లా పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఇప్పుడు మహేష్ పీసీసీ అధ్యక్షుడయ్యాక సైలెంట్ అయ్యారు.
ఆయన మిగితా సెగ్మెంట్ ల్లో అతిగా జోక్యం చేసుకోవడం లేదు. అసలే మంత్రి పదవి దక్కక తీవ్ర నిరాశలో ఉన్న ఆయన ఇలాంటి వివాదాలకు దూరంగా వుంటున్నారు.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డిన మహేష్ పీసీసీ పీఠం దక్కడంతో సహజంగానే జిల్లా పార్టీలో సమీకరణాలు మారాయి.ఇప్పుడు ఆయన అనుమతి లేనిదే పార్టీ వ్యహారాల్లో మిగితా నేతలెవ్వరూ ఇష్టానుసారంగా వేలు పెట్టె పరిస్థితి లేకుండ పోయింది.
ఆయన చేపట్టిన జనహిత పాదయాత్ర కు పార్టీ శ్రేణులు పోటెత్తారు.పార్టీ అధికారంలో ఉన్న సరే లోకల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చే పరిస్థితి లేదని భావించిన పీసీసీ జనహిత సూపర్ హిట్ కావడంతో ఊపిరి పీల్చుకుంది.
