Thursday, March 26, 2026
HomeCRIMEనమ్మించి గొంతు నులిమేశాడు ....ఆపై శవం ను తగలపెట్టేసాడు ......వీడిన మల్లారం హత్య మిస్టరీ ....

నమ్మించి గొంతు నులిమేశాడు ….ఆపై శవం ను తగలపెట్టేసాడు ……వీడిన మల్లారం హత్య మిస్టరీ ….

విందు చేసుకుందాం అని స్నేహితుడి ని ఇంటికి పిలిచి సరదా గా మాట్లాడుతూనే గొంతు నులిమి హత్య చేసాడు.మల్లారం అటవీ ప్రాంతంలో ఆదివారం కాలిన మృతదేహం కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చింది. ఈ హత్య మిస్టరీ వీడింది.

నిందితుడు కరుగట్టిన నేరస్తుడిగా వెల్లడయింది. నిజమాబాద్ నగరంలో నాగారం 50 క్వార్ట్రర్స్ లో నివాసం ఉండే సోహెల్ గతంలో కామారెడ్డి జిల్లాలో అనేక దొంతనాల కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆదిలాబాద్ జిల్లా నేరేడు మెట్ కు చెందిన గంగయ్య తో గత కొన్నేళ్ల క్రితం పరిచయం ఉంది.

గత నాలుగు రోజుల క్రితం దావత్ ఇస్తానని నమ్మబలికి గంగయ్యను నిజామాబాద్ కు రప్పించాడు సోహెల్ . తన స్నేహితుడు వస్తున్నాడని భార్య కు చెప్పి వంటలు కూడా చేయించాడు. ఇద్దరు కలిసి పాడుబడిన పాత ఇంట్లో దావత్ చేసుకోవడానికి వెళ్లారు.

ఇద్దరి మధ్య ఏ వివాదం తలెత్తిందో కానీ సోహెల్ అర్ద రాత్రి గంగయ్య గొంతు నులిమి హత్య చేసాడు. శవం ను ఓ గోనె సంచీ వేసి కట్టేసాడు. అదే రాత్రి సమీపంలోనే ఉండే కొడుకు ను తనసొంత ఆటో రిక్షా తీస్కొని రావాలని పురమాయించాడు.

ఆమేరకు కొడుకు ఆటో తీసుకోని పాత ఇంటికి వెళ్లగా గోనె సంచి ని ఆటో రిక్షాలో ఎక్కించాడు. ఆ సంచి లోపాత సామాను వుందని మల్లారం వైపు తీసుకెళ్లి తగలబెట్టాలని నమ్మబలికాడు. ఇద్దరు కలిసి మల్లారం అటవీ ప్రాంతానికి మధ్య రాత్రి వెళ్లారు.

గోనె సంచి దింపేసి కొడుకు ను పంపించేశాడు. ఆ శవం సంచి దట్టమైన అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఎండిన పొరక పెట్టేసి శవం కు నిప్పుపెట్టేసాడు. సెల్ ఫోన్ ఆధారంగా కేసు లో దర్యాప్తు మొదలు పెట్టారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!