బిజెపి తప్పుడు వాగ్దానాలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు 2018 ఎన్నికల్లో ఏ వాగ్దానాలో అయితే ఇచ్చారో 2024 లో కూడా అవే వాగ్దానాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ అన్నారు. సోమవారం నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.
నిన్న అమిత్ షా నిజామాబాదు సభలో కొత్త వాగ్దానాలు చేస్తారని అనుకున్న కానీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మళ్ళీ అవే వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 2018లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు ఇచ్చి 2023 నవంబర్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. నిన్న జరిగిన సభలో కూడా పసుపు బోర్డు నిజామాబాద్ లోని ఏర్పాటు చేస్తామని అంటున్నారు .
అంటే ఇంతవరకు పసుపు బోర్డు గురించి చేసిన వాగ్దానాలన్నీ అబద్ధాలేనా అని ఆయన ప్రశ్నించారు. బోధనలో నీ చక్కెర కర్మాగారాన్ని సహకార సంఘాలకు ఇచ్చి నడిపిస్తామంటూ అమిత్ షా, దేశం మొత్తం ప్రైవేటీకరణ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
నిజామాబాద్ ప్రజలను అరవింద్ పూటకో మాట చెబుతూ రైతులను మోసం చేస్తున్నారు అని ఆయన అన్నారు. 2018 ఎన్నికల్లో కవితకు గుణపాఠం చెప్పినలాగే అరవింద్ కు కూడా గుణపాఠం ప్రజలు తెలుపుతారని ఆయన తెలిపారు.అలాగే చెక్కర పరిశ్రమ తిరిగి ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్లు మంజూరు చేసిందంటూ ఆయన తెలుపుకొచ్చారు సెప్టెంబర్ 17 నాటికి ప్రభుత్వం చక్కర పరిశ్రమలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు.
రిజర్వేషన్లు తీసేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బిజెపి ఇప్పటివరకు ఒక్కసారి కూడా కులగనన చేయలేదంటూ ఆయన మండిపడ్డారు. రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
దేశంలో కుల గణన చేపట్టిన తర్వాతనే రిజర్వేషన్లపై సవరణ చేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని తెలిపారు.రిజర్వేషన్ కు ఆర్ ఎస్ కు ఆర్ఎస్ఎస్ కూడా వ్యతిరేకంగా ఉందంటూ ఆయన వివరించారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోహన్ భగవతి రామ్ గారు కుల గణనపై సర్వే చేపట్టాలని ఆయన హైకోర్టులో కేసు వేశారు.
ఆ కేసుపై సుప్రీంకోర్టు కూడా కుల గణన చేపట్టవచ్చు అని తీర్పు తెలిపిందంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ్ వేణు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు