నిజామాబాద్ నగరంలోని దుబ్బ బైపాస్ రోడ్డు కలెక్టరేట్ వద్ద సోమవారం తెల్లవారు జామున జరిగినరోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మోటార్ సైకిల్ సిమెంటు మిక్సింగ్ చేసే లారీ ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్న కిరణ్ అక్కడిక్కడే మృతి చెందారు.మరో వ్యక్తి రాకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి వీరు సంజీవయ్య కాలోని కి చెందిన వారిగా గుర్తించారు.
ఈ విషయం తెలుసుకున్న యువకున్ని మిత్రులు కాలనీవాసులు హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లగా మిక్సింగ్ మిషన్ లారీ డ్రైవర్ లారీ ఆపి పారిపోయినట్టుగా తెలిపారు.