నిజామాబాద్ బిజెపి అభ్యర్థి అరవిందుకు ఓటు వేస్తే మోడీకి వేసినట్టే అని జిల్లాకు పసుపు బోర్డు ఇచ్చిన మోడీని మూడోసారి ప్రధాన కావాలని ఆకాంక్షలను ఇందూరు ప్రజలు నెరవేర్చాలని కేంద్ర హోం మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
నిజామాబాద్ నగరంలో ఆదివారం గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన బిజెపి విశాల జనసభలో ఆయన మాట్లాడారు అరవింద్ రెండోసారి ఎంపీగా గెలిస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులకు ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు అలాగే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పసుపు బోర్డును మోడీ మూడవసారి ప్రధాని అయ్యాక 100 రోజులు ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చారు
పసుపు రైతుల దశాబ్దాల కలగా ఉన్న బోర్డును అరవిందు పట్టుదలతో సహకారం చేశారని గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు అరవింద్ ప్రధాని మోడీ అనేకమార్లు ఒత్తిడి చేశారని అదే పనిగా వెంటపడి సతాయించాడని అందుకే మోడీ పసుపు బోర్డు ఇవ్వక తప్పలేదు అని ఆయన అన్నారు
మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రాహుల్ పేర్లతో ఆర్ఆర్ టాక్స్ వసూళ్లు చేస్తారని కోట్లాది రూపాయలు లూటీ చేసి ఢిల్లీ ఖజానా నింపుతారని ఆయన దుయ్యబట్టారు.
ముస్లిం ఓట్ల దూరమైతాయని భయంతో కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారని రాష్ట్రంలోనూ ఓవైసీ, కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఏబీసీలుగా మారి ముస్లిం ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఢిల్లీ పోలీసులు తనను వెంట పడుతున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వీడియోలను మార్పిడి చేస్తే ఎలా వదిలేస్తారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తుందని, మూడోసారి మెజారిటీ ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని, కానీ పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ మెజారిటీని మంచి పనులకే ఉపయోగించాడని అమిత్ షా గుర్తు చేశారు
బిజెపి ఎంపీ అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ ల పేరిట పచ్చి మోసం చేశాడని, అబద్ధాలు చెప్పి ,దేవతల పేర్లపై ఒట్టు వేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు .
సిటిజెన్షిప్ అమెండ్మెంట్ పై మీ స్టాండ్ ఏంటి అని అన్నారు తెలంగాణలో ఈ ప్రభుత్వం కొనసాగితే ఉస్మానియా యూనివర్సిటీకి మైనార్టీ స్టేటస్ ఇస్తారు ముస్లిం ఓట్ల కోసం ఎన్ని రోజులు వెట్టి చాకిరి చేస్తారని ఆయన పేర్కొన్నారు
దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయితే మరింత అభివృద్ధి చెందుతుందని సభలో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దంపతుల సూర్యనారాయణ దినేష్ కూడా చారి పైడి రాకేష్ రెడ్డి ఎండల లక్ష్మీనారాయణ పల్లె గంగారెడ్డి నేలంరాజు స్రవంతి తదితరులు పాల్గొన్నారు