పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ కు చెందిన కమల్ సింగ్ (40) ఆనంద్ నగర్ భార్య పిల్లలు ఉన్నారు.
భార్యతో కలహాల కారణంగా గత నాలుగు రోజుల క్రితం మధ్యప్రదేశ్ నుంచి నిజామాబాద్ లోని ఆనంద్ నగర్ లో కమల్ సింగ్ తల్లి దండ్రుల వద్దకు వచ్చాడని తెలిపారు.
ఈ మేరకు మనస్థాపానికి గురై శనివారం పురుగుల మందు సేవించి ఆత్మ హత్య కు పాల్పడ్డాడని తెలిపారు.
గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐదవ ఎస్ఐ తెలిపారు.