ఒంటికి నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నగరంలోని రెండవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. రెండవ టౌన్ ఎస్ఐ యాసిర్ అర్ఫత్ తెలిపిన వివరాల ప్రకారం..
వర్ని చౌరస్తాకు చెందిన శ్రీనివాస్ (45). గత కొన్ని సంవత్సరాలుగా తరచు భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం పెద్దమనుషుల ఒప్పందం ద్వారా భార్యతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు సోమవారం సాయంత్రం మద్యం మత్తులో పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అక్కడే ఉన్న స్థానికులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
