డీజే లపై పోలీసులు ఎట్టకేలకు యాక్షన్ లో కి దిగారు ఆంక్షలను బేఖాతర్ చేసే నిర్వాహకులు మీద కొరడా ఝులిపించారు. దేవీమాత శోభాయాత్ర ల్లో డీజే ల విషయంలో పోలీసు ఆంక్షలను పట్టించుకోని డీజే నిర్వాహకుల మీద మొదటి సారిగా క్రిమినల్ కేసులు నమోదు చేసారు బోధన్ నిజామాబాద్ నగరంలో రెండు చోట్ల పోలీసు కేసులు నమోదు చేయడం కలకలం రేపింది.
ఈసారి స్థానికంగా నేతలు ఒత్తిడి చేసిన పోలీసులు వెనక్కి తగ్గక పోవడం గమనార్హం. గణేష్ నిమజ్జనఉత్సవాల్లోనే కఠిన ఆంక్షలు అమలు చేయడానికి పోలీసులు సిద్ధం అయ్యారు.
డీజే లను పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు గణేష్ శోభాయాత్ర కు నాలుగు రోజుల ముందే సీపీ ఉత్త్తర్వ్యూలు ఇచ్చారు. దీనితో గణేష్ శోభాయాత్ర కోసం పెద్డయెత్తున అడ్వాన్స్ లు తీసుకోని డీజే ఆపరేటర్ లను ఎంగేజ్ చేసుకున్న నిర్వాహకులు లోబోదిబో మన్నారు.
సీపీ కలిసి తమ జీవనోపాధి దెబ్బతిని రోడ్డు న పడుతామనివిన్నవించారు అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. కానీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒత్తిడి తో సీపీ కల్మేశ్వర్ డీజే విషయంలో కొంత మేరకు సానుకూలత చూపారు.
కొన్ని షరతులతో డీజే ల నడపడానికి అంగీకరించారు. దసరా పండగ నేపథ్యంలో ఆయన కూడా బెట్టు తగ్గించుకున్నారు.
నిజామాబాదు లో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ ను డీజే నిర్వాహకులు కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు దీనితో మహేష్ గౌడ్ వెంటనే సీపీ కల్మేశ్వర్ తో మాట్లాడారు పండగ రోజుల్లో ఇలాంటి ఆంక్షలు అమలు చేస్తే నిర్వాహకులు ఉపాది కోల్పోతారని సీపీ కి నచ్చజెప్పారు డీజే నిర్వాహకుల ఆవేదన సైతం స్వయంగా వినాలని డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వస్తారని చెప్పారు వారంతా ఆదివారం సీపీ కలసి వినతి పత్రం సమర్పించారువారి సాధకబాధలు విన్న కమిషనర్ సానుకూలంగా స్పందించారు. కొన్ని షరతులతో DJ లకు అనుమతి ఇవ్వడానికి అంగీకరించారు.
కేవలం రెండే బాక్స్ లతో డీజే నడుపుకోవాలని అదికూడా ముందస్తుగా సమీప స్టేషన్ ల నుంచి అనుమతి తీసుకోవాలని షరతు పెట్టారు. ఇతర రాష్ట్రాల మరియు ఇతర జిల్లాల నుండి వచ్చే డీజే లను తేవద్దని స్పష్టం చేశారు.గణేష్ నిమజ్జన శోభాయాత్ర విషయంలో డీజే ల విషయంలో చూసి చూడనట్లుగా ఉన్న పోలీసులు దేవీమాత శోభాయాత్ర ల విషయంలో పక్క కార్యాచరణతో వ్యవహరించారు ముందే అందరికి నోటీసు లు ఇచ్చేసారు.
ఆదివారం జరిగిన శోభాయాత్ర ల్లో నిబంధలను ఉల్లఘించి డీజే బాక్స్ ఎక్కువగా సంఖ్య లో పెట్టె వారిని అప్పటికప్పుడే తొలగించేలా ఒత్తిడి చేశారు అయినప్పటికి కొందరు నిర్వాహకులు పోలీసుల కళ్ళు గప్పి భారీ శబ్దాలతో రోడ్ల మీద రచ్చ చేసారు.దీనితో పోలీసులు యాక్షన్ లోకి దిగారు నిర్వాహకుల తో పాటు డీజే ఓనర్ లను స్టేషన్ లకు పిలిచి కేసులు నమోదు చేసి ఏకంగా నోటీసు లుకూడా ఇచ్చేసారు నిజామాబాద్ నగరంలో ని రెండో టౌన్ పరిధి లో ముగ్గురి డీజే యజమానులు ఆకుల సంపత్ , నవీన్ , ఆదిత్య పై కేసు నమోదు చేసి నట్లు ఎస్సై తెలిపారు మరియు వీరి డిజె లను కూడా సీజ్ చేశారు.
