కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జుక్కల్ మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జుక్కల్ మండలంలోని కేమ్రాజ్ కలరి గ్రామానికి చెందిన బస్వంత్ (26).
ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత 15 రోజుల క్రితం భార్యతో గొడవ జరిగడంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ మేరకు బస్వంత్ తీవ్ర మనస్థాపానికి గురై శనివారం పురుగుల మందు సేవించి ఆత్మ హత్య పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
