Friday, April 17, 2026
HomeTelanganaNizamabadబిఆర్ యస్ కు మరో ఝలక్ ....ఇద్దరు కీలక నేతలు జంప్ .....మాజీ డిప్యూటీ మేయర్,మాజీ...

బిఆర్ యస్ కు మరో ఝలక్ ….ఇద్దరు కీలక నేతలు జంప్ …..మాజీ డిప్యూటీ మేయర్,మాజీ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ ……..ఒక్కొరుగా జారుకుంటున్న మైనార్టీ నేతలు ……

స్థానిక ఎన్నికల సమరం సమీపిస్తున్న నేపథ్యంలో బిఆర్ యస్ పార్టీ మరో ఝలక్ తగలబోతుంది. బలమైన నేతలు మరో ఇద్దరు కారు దిగనున్నారు. ముఖ్యంగా బిఆర్ యస్ లో క్రియాశీలకంగా ఉన్న మైనార్టీ నేతలు ఒక్కొరుగా పార్టీ వీడుతున్నారు.

ఆ పార్టీ లో పేరున్న నేతలే లేకుండా పోయారు. అసెంబ్లీ లోకసభ ఎన్నికల ఫలితాల తో కుదేలైన ఆ పార్టీ ని వలస కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యే అడ్రస్ లేకుండా పోయారు.

నియోజకవర్గాలకు చుట్టపు చూపు గా వచ్చి వెళ్తున్నారు. కానీ వలస ఆపడానికి కనీస కట్టడి చేయలేక పోతున్నారు. మాజీ ఎమ్మెల్యే లు నియోజకవర్గాల కు రాకుండా మొఖం చాటేస్తుడడం తో ద్వితీయ శ్రేణి నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కండువా లు మార్చేస్తున్నారు.

తాజాగా మైనార్టీ లో తిరుగులేని నేతలుగా ముద్ర ఉన్న ఇద్దరు కీలక నేతలు పార్టీ ని వీడనున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ లో ఆపార్టీ కి ఇదో కుదుపే.

మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ తో పాటు మాజీ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ ఫయాజ్ లతో పాటు అమర్ లు బిఆర్ యస్ ను విడనున్నారు. వారు ముగ్గురు యంఐయం పార్టీలో చేరనున్నారు.

ఆదివారం ఆ పార్టీ అధినేత హాసదొద్దీన్ ఒవైసీ సమక్షంలో దారుస్సలాం లో పచ్చ కండువా వేసుకొన్నారు. మీర్ మజాజ్ గతంలో యంఐయం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ లో ఉంది డిప్యూటీ మేయర్ గా పనిచేసారు. మజాజ్ ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడిగా ఉన్నారు. అలాగే సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉండి బిఆర్ యస్ లోకి వచ్చిన మరో కీలక నేత ఫయాజ్ మాజీ ఎమ్మెల్యే బిగాల సన్నిహితుడు.

ఈ ఇద్దరు నేతలకు మైనార్టీల్లో మంచి పట్టు ఉంది. ఒకే ఇద్దరు నేతలు గులాబీ పార్టీ వీడి యంఐయం లో చేరుతున్నరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!