ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన నవిపే మండల కేంద్రము లో చోటు చేసుకుంది. నవిపేట్ ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.
మండలంలోని వీరన్న గుట్ట కు చెందిన ప్రవీణ్ కుమార్(40). ఈ నెల 15 ఉదయం తన కూతురు నీ స్కూల్లో వదలడానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు బైక్ స్కిడ్ అయ్యి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యుల హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ బుదవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు.