నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన గల అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.పోచారం గ్రామం వైవు నుంచి అలీసాగర్ లిఫ్ట్ పంప్ హౌస్ కాలువ ద్వారా లిఫ్ట్ తూము వద్దకు చేరింది.లిఫ్ట్ పంప్ హౌస్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమాచారం మేరకు సంఘటన స్థలం నుండి ఈతాగాళ్ల సహాయంతో కాలువ లో నుండి మృతదేహాన్ని వెలికి తీశారు.
మృత దేహం నిజామాబాద్ మార్చురీ కి తరలించినట్లు తెలిపారు. ఎవరైనా యస్ ఐ ఎడపల్లి 8712659873,పీ యస్ ఎడపల్లి 8712659780 నంబర్ లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
