బోధన్ మండలంలోని బండారుపల్లి శివారులో మంగళవారం ఓ రూరల్ పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తాపడింది.
పూర్తి వివరాలు కల్దుర్కి గ్రామం నుంచి బోధన్ వైపు వెళ్తున్న రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనం బండారుపల్లి బ్రిడ్జి వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, డ్రైవర్‌కు స్వల్ప గాయాలే అయినట్లు తెలిసింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
