పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే నిజామాబాద్ ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని, రాoపూర్ గ్రామ శివర్, మామిడి తోట పక్కన నిర్వహించబడుతున్న పేకాట స్థావరం పై రైడ్ చేసి 9మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి 5సెల్ ఫోన్ , ద్విచక్ర వాహనాలు 3 ,నగదు 45110/- రూపాయలు స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు.
