HomeTelanganaNizamabadరేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు 57 పరీక్ష కేంద్రాలు.. 36,222...

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు 57 పరీక్ష కేంద్రాలు.. 36,222 మంది విద్యార్థులు..

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 5 నుంచి 25 వరకు జరుగుతాయని ఇంటర్‌ విద్యాశాఖాధికారి తిరుమలపుడి రవికుమార్ పేర్కొన్నారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, అనివార్య పరిస్థితుల్లో పరీక్షా సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని ఆయన తెలిపారు.

ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లాలో మొత్తం 36,222 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరి కోసం మొత్తం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలియజేశారు.మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 15,053కాగా, ఒకేషనల్ విద్యార్థులు 2,736 మొదటి సంవత్సరం మొత్తం 17,789 విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.

రెండవ సంవత్సరం జనరల్ రెగ్యులర్ 13,944 మంది విద్యార్థులు, ప్రైవేటు (సప్లిమెంటరీ) 2,128 మంది విద్యార్థులు, ఒకేషనల్ రెండవ సంవత్సరం రెగ్యులర్ 2,042 మంది విద్యార్థులు, ప్రైవేటు 319 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలియజేశారు.

జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు,రెండు ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, రెండు సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, 7 మోడల్ జూనియర్ కళాశాలలు, రెండు మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, ఒక బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, 26 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ఒక ప్రభుత్వ హై స్కూల్ ను పరీక్ష కేంద్రాలుగా కేటాయించామని తెలియజేశారు.

అలాగే ఈసారి అన్ని ప్రశ్నపత్రాలపై ప్రత్యేక వరుస సంఖ్య(యునిక్‌ సీరియల్‌ ఐడీ) ముద్రించామని, దీంతో విద్యార్థులకు వెళ్లే ప్రశ్నపత్రం వివరాలు ముందే తెలుసుకోవచ్చన్నారు.

పరీక్ష కేంద్రంలోకి విద్యార్థుల చేతి గడియారాలు అనుమతించమని, ప్రతి 30 నిమిషాలకు ఇన్విజిలేటర్‌ సమయాన్ని తెలియజేస్తారని చెప్పారు. ఈసారి అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారని తెలియజేశారు.

అలాగే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రంలో ఆశా వర్కర్ లు, ఏఎన్ఎం ల ఆధ్వర్యంలో ఆరోగ్య సేవలు అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు పరీక్షా కేంద్రాలను శుభ్రం చేయించడంతో పాటు, మంచి వాతావరణం కల్పిస్తూ, మంచినీటి వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేశారని అన్నారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు…..

పరీక్షల నిర్వహణకు జిల్లాలోని 57 పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా తాను, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 8 మంది సిటింగ్ స్కాడ్ లు, ఒక హైపవర్ కమిటీ, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ముగ్గురు తనిఖీలు చేస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments