ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటన నందిపేట్ మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం.. మమాక్లూర్ మండలం ధర్మోర గ్రామానికి చెందిన గంధం గంగాధర్ రెండు సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసమని గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు.
వెళ్లిన తర్వాత అక్కడ సరైన ఉపాధి లభించక పోవడంతో ఆర్థికంగా నష్టపోయి నెల రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చాడు. ఆర్థికంగా నష్టపోయి అప్పుల కావడంతో బతుకు భారమై ఏం చేయలేని నిస్సహాయ స్థితి జీవితం పై విరక్తి చెంది మండల పరిధిలోనీ ఐలాపూర్ గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
భార్య సుశీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
