మురికి కాలువల పడి వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన 5 వ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై గంగాధర్ కథనం ప్రకారం.. సీతారాం నగర్ కాలనీకి చెందిన కామ్రే కపిల్ (38). లేబర్ గా పనులు చేస్తారు.
మంగళవారం రాత్రి వర్ని చౌరస్తా లోని కల్లు బట్టి వద్ద మద్యం సేవించాడు.అనంతరం పక్కనే ఉన్న మురికి కాలువలో మూత్ర విసర్జన కోసం వెళ్ళగా కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
