మద్యం మత్తులో కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం…
కోటగల్లికి చెందిన శ్రీనివాస్(40) వృతి రీత్యా పెట్రోల్ బంకులో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం రాత్రి మద్యం సేవించి న్యాల్ కల్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన చెత్తకుప్పలో మూత్ర విసర్జనకు కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మద్యం మత్తులో కింద పడిపోవడంతో శ్వాస అడక మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
