క్షణికావేశంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఐదవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే నాగారం లోని ఒడ్డేరా కాలానికి చెందిన దండ్ల నగేష్(35).గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన పనులకి వెళ్ళడం లేదు.
దీంతో మంగళవారం కుటుంబ సభ్యులు పనులకు వెళ్ళడం లేదని గొడవ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నిజమా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గంగాధర్ తెలిపారు.
